PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ "పాపం"…
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ కు ఒక లేఖ అందింది. ఈ లేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ రాశారు. బంగ్లాదేశ్ మార్చి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది.