Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayush Singh: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదం మారుమోగిపోతోంది. ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తున్న ఈ తరుణంలో.. కేవలం ఒక 19 ఏళ్ల భారతీయ యువకుడు ఏఐ ద్వారా నెలకు ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఆయుష్ సింగ్ అనే ఈ కుర్రాడి విజయగాథ ఇప్పుడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. మనోడి కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయుష్ సింగ్‌కి ఐఐటీ (IIT) లేదా ఎంఐటీ (MIT) వంటి ఎలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డిగ్రీ లేదు. కేవలం తన సొంత ఇంట్రస్ట్‌తో, ఇంటర్నెట్ సాయంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాలపై పట్టు సాధించాడు. సాధారణంగా 13 ఏళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. కానీ ఆయుష్ మాత్రం ఆ చిన్న వయసులోనే కోడింగ్, మెషిన్ లెర్నింగ్ లోతుపాతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో దొరికిన ఖాళీ టైంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్వేషణకు పూర్తిగా ఉపయోగించుకున్నాడు.
కోటీశ్వరుడిని చేసిన ‘టాప్‌మేట్’ బిజినెస్ మోడల్
ఓర్పు, నేర్చుకోవాలనే పట్టుదల ఆయుష్‌కి ఏఐ రంగంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి పెట్టింది. ఇదే సమయంలో ఆయన తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, నూతన సాంకేతికతలపై ఆన్లైన్ కోర్సులను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయుష్ తన ఏఐ కోర్సులను ప్రసిద్ధ మెంటార్షిప్ ప్లాట్‌ఫామ్ ‘టాప్‌మేట్’ (Topmate) ద్వారా విక్రయిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులు, నిపుణులు భారీగా ఫీజులు చెల్లించి ఇతని కోర్సుల్లో చేరుతున్నారు. ఈ కోర్సులు నేర్పడం ద్వారా అతనికి లక్షల నుంచి ఏకంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
ఆయుష్ సింగ్ సాధించిన ఈ అరుదైన విజయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్స్ చేస్తున్నారు. 19 ఏళ్లకే ఈ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదని, దేశ యువతకు ఆయుష్ ఒక రోల్ మోడల్ అని చాలా మంది కొనియాడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు నెట్టిజన్లు ఈ వార్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద “కోర్సుల అమ్మకం మోసం” అని విమర్శిస్తున్నారు. అతను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారం చేయడం లేదని, కేవలం ఏఐ నేర్పిస్తానంటూ కోర్సులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ కోర్సులు కూడా నాణ్యంగా లేవని, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంత చిన్న వయసులో కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన ఆయుష్ సింగ్ ఉదంతం మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
This 19 year old is earning 1cr just by selling ai courses on topmate😭
I’ll KMS🙏🏻 pic.twitter.com/Ppw080WRsh— Anushka Singh (@nush_1320) June 23, 2026
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!