Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Party Demanding India China Border Issue Discussion In Parliament

Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్

Published Date :December 13, 2022 , 12:09 pm
By NTV WebDesk
Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Congress Party Demanding India China Border Issue Discussion In Parliament: అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘వాస్తవాధీన రేఖ’ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్‌ సమావేశాల్లో దుమారం రేగే అవకాశం ఉంది. ఈ విషయంపై లోక్‌సభలో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఈ ఘర్షణపై చర్చను కోరుతూ.. త్రిణమూల్ కాంగ్రెస్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత ప్రతిపక్షాలూ చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌‌లో చర్చ జరిపి.. దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారి, సయ్యద్ నాసిర్ హుస్సేన్‌లతో పాటు ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరుతున్నారు.

AHA: ఓటీటీలో ‘వాళ్ళిద్దరి మధ్య’! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!

Also Read

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

ఇదే సమయంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదని, అందరిదీ ఒకటే మాట అని, దీన్ని రాజకీయ చేయదలచుకోలేదని పేర్కొంది. 2020 నుంచి భారత్-చైనా మధ్య జరుగుతున్న దాడులు, సరిహద్దుల వద్ద అక్కడక్కడ జరిగిన నిర్మాణాల విషయంలో మోడీ ప్రభుత్వం నిజాయితీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. అటు.. జైరామ్ రమేశ్ కూడా చైనా చర్యలపై నిద్రబోతున్న ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. సరిహద్దు సమస్యను తొక్కిపెట్టాలన్న మోడీ ప్రభుత్వ ధోరణితోనే చైనా మొండివైఖరి మరింతగా పెరిగిపోతోందని విమర్శించారు.

Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..

ఈ నేపథ్యంలోనే గల్వాన్ ఘర్షణపై మోడీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దేశంలోకి ఎవరూ రాలేదు, ఎవరూ భారత్ భూభాగాన్ని ఆక్రమించలేదు, భారత్ సైనిక స్థావరాలేవీ ఎవరి అధీనంలో లేవు అంటూ మోడీ వ్యాఖ్యానించినవీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో చైనా పేరుని ప్రస్తావించి ఉంటే, ఇప్పుడా దేశం భారత్ వైపు చూసే సాహసం చేసి ఉండేది కాదని కాంగ్రెస్ చురకలంటించింది. మరోవైపు.. లోకసభ లో వాయుదా తీర్మానం కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీస్ ఇచ్చారు. ఘర్షణ గురించి పార్లమెంట్‌కు మోడీ ప్రభుత్వం తెలియజేయలేదని, ఆవిషయాన్ని దాచి ఉంచిందంటూ ధ్వజమెత్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asaduddin Owaisi
  • Congress Party
  • india-china border
  • Parliament Winter Session
  • PM Narendra Modi

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions