Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం
- సియా, సోనమ్‌కు ఉరిశిక్షే పడాలంటూ డిమాండ్
- ముస్కాన్ కూడా చంపేయాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన హనీమూన్ మర్డర్ కేసుకు దగ్గరగా ఉండడంతో రెండు కేసుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా కేతన్ హత్య కేసుపై భార్య సోనమ్ రఘువంశీ చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ కుటుంబం స్పందించింది. కేతన్ హత్యకు, రాజా హత్యకు చాలా పోలికలు ఉన్నాయని.. నిందితులు సియా గోయల్, సోనమ్ రఘువంశీ ఇద్దరికీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది.
సోనమే కారణం..
మీడియాతో మాట్లాడిన రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ.. ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇతర యువతులను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి అమ్మాయిలు చేస్తున్న పనులను చూసి మరికొందరికి కూడా ధైర్యం వస్తోంది. పూణెలో జరిగిన ఘటన కూడా అలాగే జరిగింది. నా కుమారుడు రాజాను ఎలా కొండపై నుంచి తోసేశారో.. అదే తరహాలో కేతన్‌ను కూడా లోయలోకి నెట్టేశారు. ఇది చాలా బాధాకరం.’’ అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమా రఘువంశీ డిమాండ్ చేశారు.
Also Read
- Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
- Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
- Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
- Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
‘‘సోనమ్, ముస్కాన్, సియా వంటి వారికి ఉరిశిక్ష విధించినప్పుడే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. సోనమ్ జైలు నుంచి బయటకు రావడమే సియాకు ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. కేవలం 11 నెలల్లోనే ఆమె ఎలా బయటకు వచ్చింది? ఆమె కేసు ఎందుకు వేగంగా విచారణకు రావడం లేదు? మళ్లీ జైలుకు ఎందుకు పంపలేదు? సోనమ్ బయటకు రావడాన్ని చూసే తాను కూడా తప్పించుకోగలనని సియా భావించి ఉండొచ్చు.’’ అని వ్యాఖ్యానించారు.
రాజా సోదరుడి కీలక వ్యాఖ్యలు
రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ కూడా రెండు ఘటనల మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు. ‘‘నా సోదరుడిని కూడా ఇలాగే హత్య చేశారు. అప్పట్లో సోనమ్ కుటుంబం ఆమెకు శిక్ష పడేలా చేస్తామని చెప్పింది. కానీ తర్వాత ఆమెను జైలు నుంచి బయటకు తీసుకొచ్చి కాపాడింది. ఇప్పుడు సియా తండ్రి కూడా ఒకవేళ తన కుమార్తె దోషి అయితే శిక్షించాలని చెబుతున్నారు. కానీ సోనమ్‌కు కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. సియా ఇలాంటి నేరానికి పాల్పడే ధైర్యం చేసేది కాదేమో.’’ అని అన్నారు.

కేతన్ అగర్వాల్‌ను.. కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లోయలోకి తోసివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ జూన్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించి, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు.
#WATCH | Indore, MP | Ketan Agarwal Murder Case | Raja Raghuvanshi's mother, Uma Raghuvanshi, says, “My point is that other girls see what these girls are doing and feel emboldened. Take the recent case in Pune, that girl was encouraged by seeing Sonam's actions. Just as Raja was… pic.twitter.com/nb5wk3VyAo
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 26, 2026
తాజావార్తలు
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
-
IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..