Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు.
రూ.79 లకే సబ్స్క్రిప్షన్..
ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు తమ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అక్కడ కనిపించే ‘వాట్సాప్ ప్లస్’ ఆప్షన్‌ను ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రీమియం సేవల కోసం మెటా సంస్థ నెలకు కేవలం రూ.79 సబ్స్క్రిప్షన్ ఛార్జ్ వసూలు చేస్తోంది. ఒకవేళ ఈ సేవలు నచ్చకపోయినా లేదా అవసరం లేదు అనుకున్నా.. వినియోగదారులు తమకు నచ్చినప్పుడు, ఎప్పుడైనా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలాంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
Also Read
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
- Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
- Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
‘వాట్సాప్ ప్లస్’ లో లభించే అద్భుతమైన ఫీచర్లు..
ఈ పెయిడ్ సర్వీస్ ద్వారా సాధారణ వాట్సాప్‌లో లేని ఎన్నో సరికొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సాధారణ వాట్సాప్‌లో కేవలం 3 ముఖ్యమైన చాట్స్ లేదా గ్రూప్‌లను మాత్రమే స్క్రీన్ పైన పిన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, వాట్సాప్ ప్లస్‌లో ఏకంగా 20 గ్రూప్స్ లేదా చాట్స్‌ను పిన్ చేసుకోవచ్చు. ఆఫీస్, ఫ్యామిలీ గ్రూపులు ఎక్కువగా వాడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

ఎప్పుడూ ఒకే రకమైన గ్రీన్ కలర్ లోగో చూసి బోర్ కొట్టిన వారికి ఇది గుడ్ న్యూస్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ లోగోను మీకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. చాట్ లోపల ఉండే టెక్ట్స్ బబుల్స్, మెసేజ్ పంపినప్పుడు వచ్చే టిక్స్, బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్స్ వంటి వాటన్నింటినీ మనం ఎంపిక చేసుకునే ప్రత్యేక థీమ్ లోకి పూర్తిగా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన థీమ్‌తో పాటు విభిన్నమైన రింగ్టోన్లు, నోటిఫికేషన్ టోన్లను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు.. చాటింగ్‌ను మరింత సరదాగా మార్చేందుకు వాట్సాప్ ప్లస్ యూజర్ల కోసం ప్రత్యేకమైన యానిమేషన్‌తో కూడిన స్టిక్కర్లను మెటా ఇందులో జోడించింది. సాధారణ వాట్సాప్ ఫీచర్లతో విసిగిపోయి, సరికొత్త లుక్ అండ్ ఫీచర్స్ కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ ‘వాట్సాప్ ప్లస్’ ఒక సరికొత్త డిజిటల్ అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!