రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Smart 4 Plus Launched: లావా నుండి ‘స్మార్ట్’ సిరీస్‌లో భాగంగా కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ Lava Smart 4 Plusను లాంచ్ చేసింది. ఈ మధ్యనే Bold N2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్, మంచి విజువల్ అనుభూతిని అందిస్తుంది. పెద్ద డిస్ప్లే కారణంగా వీడియోలు, సోషల్ మీడియా బ్రౌజింగ్ అండ్ గేమింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఆక్టా-కోర్ UNISOC 9863A ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 4GB RAMతో పాటు అదనంగా 4GB వర్చువల్ RAM పెంచుకొనే ఫీచర్‌ను అందిస్తుంది. దీంతో మొత్తం 8GB వరకు ర్యామ్ అనుభవాన్ని పొందవచ్చు. ఫోన్లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఫోటోగ్రఫీ కోసం లావా స్మార్ట్ 4 ప్లస్ లో 13MP ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ AI కెమెరాను అందించారు. HDR, పోర్ట్రెయిట్, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 5MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh సామర్థ్యంతో ఉన్న బ్యాటరీని అందించారు. ఇది 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. USB టైపు-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. వీటితోపాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.9,999గా నిర్ణయించారు. ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీతో పాటు ఉచిత హోమ్ సర్వీస్ సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో, ఫైనాన్షియల్ స్కీమ్స్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!