Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు
- బాలీవుడ్ సినిమా పోస్టర్లతో వ్యంగ్యాస్త్రాలు
- బీజేపీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఈసారి బీజేపీ వినూత్నంగా స్పందించింది.. ప్రముఖ బాలీవుడ్ చిత్రాల పోస్టర్లను మార్ఫింగ్ చేసి రాహుల్ గాంధీపై వ్యంగ్య పోస్టులను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ విదేశాలకు వెళ్లిపోతారని ఆరోపిస్తూనే ఆచూకీపై ప్రశ్నలు లేవనెత్తింది.

Also Read
బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో.. “దేశంలో ఎన్నికలు రాగానే ప్రచారం.. ఎన్నికలు ముగిశాక విదేశాలకు విమానం ఎక్కడం.. ఇదే రాహుల్ గాంధీ అసలు గుర్తింపు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి మాత్రమే కాదు.. ప్రజల పట్ల బాధ్యత కూడా ముఖ్యం. కానీ రాహుల్ గాంధీ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. దేశ ప్రజలతో ఆయనకు ఎలాంటి అనుబంధం లేదు” అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా పలు రాష్ట్ర బీజేపీ యూనిట్లు కూడా బాలీవుడ్ సినిమాల పేర్లను అనుకరిస్తూ ‘చడ్ దే ఇండియా’, ‘లాపతా రాహుల్’ వంటి వ్యంగ్య పోస్టర్లను విడుదల చేసి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సెటైర్లు వేశాయి.
కాంగ్రెస్ కౌంటర్
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు వ్యక్తిగతమైనవి కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సంస్థలు, అంతర్జాతీయ వేదికల నుంచి వచ్చే ఆహ్వానాల మేరకే ఆయన విదేశాలకు వెళ్తున్నారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ కేవలం భారత నాయకుడు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు. అనేక దేశాల్లోని సంస్థలు, నాయకులు ఆయనను ఆహ్వానిస్తూ మాట్లాడాలని, చర్చించాలని కోరుకుంటుంటారు. అందుకే ఆయన రెండు, నాలుగు లేదా ఐదు రోజులపాటు మాత్రమే విదేశీ పర్యటనలు చేస్తుంటారు” అని చెప్పారు.
రాహుల్ గాంధీని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా అభివర్ణించిన ఖుర్షీద్.. ఆయన విదేశీ పర్యటనలను రాజకీయ విమర్శలకు వాడుకోవడం సరికాదని బీజేపీపై మండిపడ్డారు. దీంతో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల అంశం మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపుతోంది.
चुनाव आते ही देश में…
हार मिलते ही विदेश की उड़ान भरना,
यही है राहुल गांधी की असली पहचान!देश की राजनीति में सवाल सिर्फ चुनाव जीतने-हारने का नहीं, बल्कि जिम्मेदारी निभाने का भी होता है।
लेकिन राहुल गांधी की राजनीति सिर्फ चुनाव जीतने और हारने तक ही सीमित है, इनको देश की जनता… pic.twitter.com/AzzM9YWnvG
— BJP (@BJP4India) June 25, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు