Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళితో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు, నేను తోపు హీరోని అనుకున్న వాడిని సైతం వామ్మో అనుకునేలా చేస్తాడు. అది తారక్ అయినా, మహేష్ బాబు అయినా సరే తనకి సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే ఎన్ని రోజులైనా షూట్ చేయాల్సిందే. జక్కనతో అంత ఈజీ కాదని పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా బోధపడింది. రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన దగ్గర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళేసరికి హీరోలకు బొమ్మ చూపిస్తూ ఉంటాడు, ఆయనతో వర్క్ చేసిన హీరోలే ఈ విషయం పలుమార్లు చెప్పుకొచ్చారు. తారక్, చరణ్, ప్రభాస్ ‘పని రాక్షసుడు’ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేశారు కూడా. దీనికి మహేష్ బాబు కూడా మినహాయింపు ఏం కాదు. ఈ సీన్ చేయనంటే కుదరదు, కమిట్మెంట్ ఇచ్చాక పాస్‌పోర్ట్ తీసుకున్నా ఈజీ కాదని అర్థమైంది. ఇదే విషయాన్ని తాజాగా పృథ్వీరాజ్ కూడా బయట పెట్టాడు. వారణాసిలో ఓ స్పెషల్ షాట్ కోసం ఉదయాన్నే మొదలు పెట్టి సాయంత్రం కూడా ఫినిష్ చేయలేదట జక్కన్న. ఆ షాట్ కోసం 90 కి పైగా టేక్స్ తీసుకున్నామని, షూట్లో లంచ్ బ్రేక్ 20 నిమిషాలే తీసుకున్నామని రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పృథ్వి. ఎట్టకేలకు ఆ షూట్ మరుసటి రోజు పూర్తి చేసామని వెల్లడించాడు పృథ్వీరాజ్.
అలాగే జక్కనపై ప్రశంసలు కురిపించేసాడు మలయాళ హీరో పృథ్వి. సీన్ వివరించేటప్పుడు ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాడని, ఇంత కష్టపడే దర్శకుడిని చూడలేదు అన్నాడు. మేము షూటింగ్ స్పాట్ లోకి వెళ్ళే సమయానికి రాజమౌళి వచ్చేసి తమ సీన్స్ రిహర్సల్స్ చేసేస్తాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనతో సినిమా అంటే మామూలుగా ఉండదని పొరుగు హీరోలకు తెలిసేలా చేశాడు జక్కన్న. వారణాసిలో పృథ్వి ‘రణకుంభ’గా కనిపించబోతున్నాడు. ఈ మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎన్ని సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!