ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగంపైనే. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూనే వుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు లభించాయి. చెన్నై మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కింది. అందునా 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు స్వీకరించి రికార్డులకెక్కారు. ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళలే మేయర్లు కావడం మరో విశేషం. కాగా, మొత్తం 200 మంది కార్పొరేటర్లలో డీఎంకేకు చెందిన 153 మంది, ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను మేయర్‌గా ఎన్నుకున్నారు. అతి పిన్నవయస్కురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియను రాజకీయ ప్రముఖులు అభినందించారు. ప్రియా మాజీ ఎమ్మెల్యే చెంగై శివం మనవరాలు. శుక్రవారం పరోక్ష ఎన్నికల తర్వాత, ప్రియ అధికారికంగా మేయర్ అయ్యారు. 1958లో తారా చెరియన్, 1971లో కామాక్షి జయరామన్ తర్వాత చెన్నైకి మూడవ మహిళా మేయర్‌గా ఎన్నికయ్యారు.మహేష్ కుమార్‌ను చెన్నై డిప్యూటీ మేయర్‌గా ప్రకటించింది డీఎంకే.
మేయర్ పదవులకు మొత్తం తొమ్మిది మంది పురుషులు, 11 మంది మహిళలు, డిప్యూటీ మేయర్ పదవులకు 10 మంది పురుషులు, ఐదుగురు మహిళలను ప్రకటించింది డీఎంకె. ఇతర మహిళా మేయర్లలో మధురై మేయర్‌గా ఇందిరానీ, కోయంబత్తూరు మేయర్‌గా కల్పన, ఈరోడ్ మేయర్‌గా నాగరత్నం, వెల్లూరు మేయర్‌గా సుజాత అనాథకుమార్, కడలూరు మేయర్‌గా సుందరి, కరూర్ మేయర్‌గా కవిత గణేశన్, మేయర్‌గా ఎలమతి ఉన్నారు.
దిండిగల్‌కు చెందిన, శివకాశి మేయర్‌గా సంగీత ఇంబామ్, తాంబరం మేయర్‌గా వసంతకుమారి, కాంచీపురం మేయర్‌గా మహాలక్ష్మి యువరాజ్ ఉన్నారు. తిరుచ్చి మేయర్‌గా ఎం అన్బళగన్, తిరునెల్వేలి మేయర్‌గా శరవణన్, సేలం మేయర్‌గా ఎ రామచంద్రన్, తిరుపూర్ మేయర్‌గా ఎన్ దినేష్ కుమార్, తంజావూరు మేయర్‌గా రామనాథన్, తమిళగన్ మేయర్‌గా తమిళరసన్, మేయర్‌గా సత్య ఉన్నారు. హోసూరు మేయర్‌గా ఎంపీ జెగన్, తూత్తుకుడి మేయర్‌గా మహేష్, నాగర్‌కోయిల్ మేయర్‌గా మహేశ్, ఆవడి మేయర్‌గా జి ఉదయకుమార్ ఎంపికచేశారు. ఇటు హైదరాబాద్ మేయర్ గానూ మహిళే వుండడం విశేషం. హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి కొనసాగుతున్నారు. తెలంగాణ, ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది విజయబావుటా ఎగరేసి మేయర్, మునిసిపల్ చైర్ పర్సన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.