ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగంపైనే. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూనే వుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు లభించాయి. చెన్నై మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కింది. అందునా 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు…