దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి రక్షణ కోసం వినిగిస్తున్న బూస్టర్ డోస్‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 18 నుంచి 59 ఏళ్ల వారికి బూస్టర్ డోస్‌ను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్టర్ డోస్‌ను శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్‌పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్‌పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రెండున్నర నెలలపాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ‘ఆజాదీకా అమృత్ మహాత్సవ్’లో భాగంగా ప్రికాషన్ డోసు పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపాయి. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీ ప్రారంభించింది. దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు.
Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలిందని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా బూస్టర్ డోసును ఉచితంగా పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.