Bihar: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై తాజాగా రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన తెలిపిన స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.