Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు.
బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు హత్యా రాజకీయాలు సంచలనంగా మారాయి. గురువారం, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే, మోకామా నుంచి పోటీ చేస్తున్న జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
బీహార్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు.
బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు.
బీహార్‌లో వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి ముందే ఖేమ్కాను తుపాకీతో కాల్చి చంపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నాలో జరిగిన రాజకీయ హత్య తీవ్ర సంచలనంగా మారింది. ఇంటి ముందే వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు! పాట్నాలోని చికిత్స అందించారు. అనంతరం వైద్యులు ఆయనను ఢిల్లీకి వెళ్లమని సలహా ఇచ్చారు. లాలూ యాదవ్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆయనకు తగిలిన పాత గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఉదయం లాలు ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం.. రబ్రీ నివాసంలో వైద్యుల…