దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు చదువులో ఫెయిల్యూర్ అయ్యారని.. అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలు రాజకీయకంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
BJP's Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది,
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. "భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.