Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP: పహల్గామ్ దాడి తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పటికే, కొందరు నేతలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ‘‘హిందువులు’’ అని అడిగి చంపలేదు అని అన్నారు. తాజాగా, పంజాబ్ మాజీ సీఎం, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శనివారం, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారత సాయుధ దళాలను నిరాశ…
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది.
Deep State: భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ‘‘యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్’’ పనిచేస్తుందని బీజేపీ ఆరోపించింది. అమెరికా ‘డీప్ స్టేట్’ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యం చేసుకుంటుందని పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉందని అన్నారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉన్నత స్థాయి ద్రోహిగా అభివర్ణించారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ముక్కోణపు బంధం గురించి మాట్లాడబోతున్నామని బీజేపీ నేత అన్నారు
Sambit Patra: బీజేపీ నేత సంబిత్ పాత్ర నోరుజారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాత మీడియాలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని టంగ్ స్లిప్ అయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఈ మాట అన్నది మరెవరో కాదు బీజేపీ నేతలు. ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది.
BJP's Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది,