Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజవాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఆదివారం వివాహ నిశ్చితార్థం చేసుకున్న సంగతి విధితమే. ఆదివారం (జూన్ 8) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గ్రాండ్ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక తన రింకూ తన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భావోద్వేగ పోస్ట్ చేసాడు. అందులో, ఈ రోజు మా హృదయాల్లో చాలా కాలంగా ఉంది.. దాదాపు మూడు సంవత్సరాలు.. కానీ ఆ నిరీక్షణ ప్రతి క్షణానికీ విలువైనదే అంటూ రాసుకొచ్చారు. పూర్తి హృదయాలతో, జీవితాంతం కలిసి సాగేందుకు.. నిశ్చితార్థం అయింది అంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
Read Also: Bhuma Akhila Priya: స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఆసుపత్రికి తరలింపు..!
ఇకపోతే, టీ20 వరల్డ్‌కప్ ముగిశాక రింకూ టీ20 ఫార్మాట్‌లో భారత్ తరపున రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. అయితే, ఇంకా వన్డే ఫార్మాట్‌లో స్థిరమైన చోటు దక్కలేదు. ఇప్పటివరకు ఆయన ఇండియా తరఫున 2 వన్డేలు మాత్రమే ఆడగా, లిస్ట్-ఏ క్రికెట్‌లో 52 ఇన్నింగ్స్‌లలో 1899 పరుగులు చేసి 48.69 సగటుతో రాణించాడు. ఇందులో ఒక శతకం, 17 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రింకూ సింగ్ ఇప్పటివరకు 33 మ్యాచులు ఆడి, 546 పరుగులు చేశాడు. ఆయన బ్యాటింగ్ సగటు 42.00 కాగా, స్ట్రైక్ రేట్ 161.06. మూడు అర్ధశతకాలు చేసినా, ఇప్పటివరకు శతకం చేయలేదు.
Read Also: Ravichandran Ashwin: మహిళా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన అశ్విన్.. వీడియో వైరల్..!
2023లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పటివరకు 59 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, 1099 పరుగులు చేశాడు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటిలోనూ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన రింకూ సింగ్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.