చాలా మంది సెలబ్రెటీలు నోటి దురుసు కారణంగా లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు ర్యాప్ సింగర్ బాద్షా కూడా ఇలాంటి పరిస్ధితిలోనే ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అనవసరంగా వార్తల్లో నిలిచాడు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాద్షా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి పాపులర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు.
Also Read : Nayanthara : నీపై నా ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు..
నార్మల్‌గా సెలబ్రేటిలు నెటిజన్స్ తో ముచ్చటిస్తు ఉంటారు. వారు అడిగిన ప్రశ్నలకు ఫనిగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించిన బాద్షా ఓ మహిళా సింగర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగింది అంటే. బాద్షా సోషల్ మీడియాలో ‘దువా లిపా’ అని రాశాడు. దానికి ఓ అభిమాని ‘భాయ్.. మీరు ఆమెతో కలిసి ఓ ట్రాక్ చేస్తున్నారా?’ అని అడిగాడు. దానికి బాద్షా రెస్పాండ్ అవుతూ.. ‘నేను ఆమెతో పిల్లల్ని కనడానికి ఇష్టపడతాను బ్రో’ అని రాసుకొచ్చాడు. దీంతో అతని సమాధానాని పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ దువా లిపా.. ఆమెతో పాట పాడటం కాదు కానీ పిల్లల్ని కంటా అని అతను పేర్కొనడం వివాదానికి దారితీసింది. బాద్షా పై ఓ రేంజ్ లో తిట్ల దండకం మొదలు పెట్టారు.