గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు.
ఉత్తరాఖండ్‌లోని మున్సియారీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం తర్వాత కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేయబడింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలు మోసాల హద్దులు దాటుతున్నారు. కొందరు పేపర్ లీక్ చేసి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తే.. మరి కొందరు సాల్వ్డ్ పేపర్ల కోసం రూ. లక్షలు వెచ్చించి అడ్డంగా బుక్ అవుతారు.
నవరాత్రుల పవిత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో భక్తులు ఒకవైపు దుర్గామాత పూజల్లో మునిగితేలుతుండగా మరోవైపు గిరిజనులు రావణుడిని ఆరాధిస్తున్నారు. జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకి మొహల్లాలో ఈ అపూర్వ దృశ్యం కనిపిస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రకటించిన ఒక రోజు తర్వాత.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ఉద్యోగుల కోసం కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది.