కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్‌లో మొదట అగ్నిపథ్‌పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి…