కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు రెండు రోజుల “భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అనేక డిమాండ్లు తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం. అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోరుతోంది.
అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు. కాంట్రాక్టు కార్మికులు చేసే ఇలాంటి పనులకు సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బీమా వంటి రంగాల కార్మికులు, ఉద్యోగులు.
పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనకుండా తమ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కేరళ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది కేరళ హైకోర్టు.
తమ ఉద్యోగులను సమ్మెలో పాల్గొనకుండా నిషేధించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఏ ఉద్యోగి అయినా పనికి హాజరుకాని పక్షంలో షో-కాజ్ నోటీసు జారీ చేయబడుతుందని పేర్కొంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. మార్చి 28, 29 రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మూడు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ఉద్యోగులపై “మహారాష్ట్ర ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్”(మెస్మా)ప్రయోగించింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయంతో ఈ చర్య తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్, ఒడిశా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సోమవారం ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లపై నిలిచిపోయాయి బస్సులు, క్యాబ్‌లు. భువనేశ్వర్‌లో రైల్వే ట్రాక్‌లను అడ్డుకున్నారు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతున్న కార్మిక సంఘాల కార్యకర్తలు.