కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు రెండు రోజుల “భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అనేక డిమాండ్లు తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం. అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోరుతోంది. అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు.…