జిల్లాల పర్యటనకు బండి సంజయ్

తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లన్నరేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే హీట్ పుట్టింది. అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. నేతలు ప్రజల మధ్య ఉండేందుకు, పార్టీ శ్రేణులను యాక్టీవ్ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ సారథి కూడా జిల్లాల బాట పట్టారు. వరసగా జిల్లాల పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు.

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. పార్టీ నేతలు జిల్లాల బాట పడుతున్నారు. పోటాపోటీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఇప్పటినుంచే పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చే నెల నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నారు. అంతకుముందే జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల్లో ఆయన పర్యటన సందర్భంగా హంగామా ఉండే విధంగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు స్థానిక నేతలు. అందరి దృష్టిని ఆకర్షించేలా టూర్ల ప్లానింగ్ జరుగుతోంది.

read also : ఇండియా కరోనా అప్డేట్‌… పెరిగిన మరణాలు

హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఆ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. తాజా రాజకీయాలకు తగ్గట్టుగానే కమల దళపతి కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు . ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈరోజు సంజయ్ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. 12న సంగారెడ్డి జిల్లా, 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. అధ్యక్షుడి జిల్లాల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-