హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి…