Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరిన ఎన్ఐఏ.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..
- ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలి..
- ఢిల్లీ హైకోర్టులో ఎన్ఐఏ అప్పీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు. ఎన్ఐఏ అప్పీల్‌పై అంతకుముందు బెంజ్ యాసిన్ మాలిక్ ప్రతిస్పందనను కోరింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొంది. ఈ అప్పీల్ గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టు దీనిని వివిధ బెంచ్‌ల ముందు ఆగస్టు 9వ తేదీని జాబితా చేసింది.
మే 2023లో, టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ మరియు జస్టిస్ తల్వంత్ సింగ్‌లతో కూడిన బెంచ్, యాసిన్ మాలిక్ తీహార్ జైలులో ఉన్నందున, జైలు సూపరింటెండెంట్ ద్వారా యాసిన్ మాలిక్‌కు నోటీసు జారీ చేసింది.
Also Read
అంతకుముందు ఎన్ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని హతమార్చి, రుబయ్యా సయీద్‌ని కిడ్నాప్ చేసినందుకు యాసిన్ మాలిక్ కారణమని వాదించారు. ఈ కిడ్నాప్ తరుపున విడుదలైన నలుగురు ఉగ్రవాదులు 26/11 ముంబై దాడులకు సూత్రధారులగా ఉన్నారని కోర్టుకు చెప్పారు. ఆయుధాల నిర్వహణలో శిక్షణ పొందేందుకు నిందితుడు యాసిన్ మాలిక్ 1980లలో పాకిస్థాన్‌కు వెళ్లాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అతను జేకేఎల్ఎఫ్ అధిపతి కావడానికి పాక్ ఐఎస్ఐ సాయం చేసింది.
Read Also: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
ఎన్ఐఏ తన అప్పీల్లో ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టులు నేరాన్ని అంగీకరించిన తర్వాత మరణశిక్ష విధించకపోతే, అది దేశ శిక్షా విధానంపై ప్రశ్నలు వస్తాయని పేర్కొంది. ఇలాంటి భయంకరమైన ఉగ్రవాది దేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యలో పాల్గొనడం, నిర్వహించడం, నాయకత్వం వహించిన తర్వాత మరణశిక్ష విధించాలని కోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల దేశం తన విలువైన సైనికులను కోల్పోయిందని, సైనిక కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ ప్రజలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఎన్ఐఏ తన అప్పీల్లో పేర్కొంది.
అంతకుముందు మే 25, 2022న, టెర్రర్ ఫండింగ్ కేసులో JKLF నాయకుడు యాసిన్ మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ దోషికి సంస్కరణ లేదు, 1994లో తాను తుపాకీని వదులుకున్నాడనేది సరైనదే కావచ్చు, కీనా కానీ 1994 సంవత్సరానికి ముందు అతను చేసిన హింసకు అతను ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేరం జరిగిన తీరు, నేరంలో ఉపయోగించిన ఆయుధాల తీరు, అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా అభివర్ణించారు. NIA కోర్టు, యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ, రూ. 10 లక్షల పైన జరిమానా కూడా విధించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు