Air India: ఎయిరిండియా ఘోర ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘‘ఆపరేషనల్ సమస్యల’’ కారణంగా అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మధ్య నడిచే సర్వీస్ – AI 159 -ను రద్దు చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే, చిక్కుకుపోయిన ప్రయాణికులను వేరే మార్గాల్లో పంపిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
విమానం AI 159 మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. దానిని మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి షెడ్యూల్ చేశారు. కానీ 1.45 గంటలకు ఎయిరిండియా ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ధ్రువీకరించింది. ఎయిరిండియా వెబ్‌సైట్ ప్రకారం, ఈ విమానం కూడా గత వారం కూలిపోయిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కావడం గమనార్హం.
Read Also: Ahmedabad Plane Crash: విమానం కూలగానే బాల్కనీ నుంచి దూకేసిన మెడికోలు.. వెలుగులోకి వీడియోలు
గతవారం ఎయిరిండియా AI 171, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిపోయిడంతో నేలపై ఉన్న మరో 33 మంది కూడా మరణించారు.