Air India: ఎయిరిండియా ఘోర ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘‘ఆపరేషనల్ సమస్యల’’ కారణంగా అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మధ్య నడిచే సర్వీస్ - AI 159 -ను రద్దు చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే, చిక్కుకుపోయిన ప్రయాణికులను వేరే మార్గాల్లో పంపిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.