ఓ ముఖ్యమంత్రి.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తారు.. అయితే, పంజాబ్‌లో రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. పీసీసీ చీఫ్‌గా ఉన్న నవజ్యోత్ సింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చన్నీ.. ఓవైపు సీఎం, పీసీసీ చీఫ్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. పోటీపోటీ ర్యాలీలు, సభలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. అయితే, ఇవాళ ఓ ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చన్నీ.. ఆసక్తికర సమాధానం చెప్పారు.. త్వరలో…
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు.…
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్‌ఎఫ్‌కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్‌ఎఫ్‌కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్…