వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది.
Also Read : Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
కాగా జైలర్ తమిళ్ తో తెలుగులోను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.రిలీజ్ రోజు మినిమం ఓపెనింగ్ అందుకున్న జైలర్ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఫైనల్ రన్ లో రూ. 100 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది. దీంతో ఇప్పుడు జైలర్ 2 థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఓ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ జైలర్ 2 తెలుగు స్టేట్స్ థియేటర్ రైట్స్ కోసం మేకర్స్ ను సంప్రదించి అవుట్ రేట్ గా రూ. 60 కోట్ల డీల్ ఆఫర్ చేసారు. కానీ జైలర్ 2 మేకర్స్ అందుకు సుముఖంగా లేరట. జైలర్ భారీ కలెక్షన్స్ రాబట్టిందని అదనంగా మరో పాతిక ఆడినట్టు సమాచారం. ఎంత మాత్రం సీక్వెల్ అయినా ఆ రేంజ్ ప్రైస్ అంటే రిస్క్ అని భావించి సదరు టాలీవుడ్ నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గింది. గతంలో రజని నటించిన సీక్వెల్ రోబో 2.O ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.