Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి కథ, కథనాల చర్చలు కూడాముగిసాయి. సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో మే 1 న విడుదలకు రెడీ గా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు.
రెట్రో హంగామా ముగిశాక వెంకీ అట్లూరి సినిమా స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు సూర్య. మరోవైపు సూర్యతో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడు. వెంకీ సినిమాలకు రెగ్యూలర్ గా సంగీతం అందించే జీవి ప్రకాష్ ఇప్పడు రాబోతున్న సూర్య సినిమాకు కూడా అతనే మ్యూజిక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా వెంకీ, సూర్య కు సంబంధించి మ్యూజిక్ పనులు మొదలు పెట్టారు. అందుకోసం దుబాయ్ లో సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. సార్, లక్కీ భాస్కర్ కు జీవి ప్రకాష్ అందించిన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సూర్య సినిమా నుండి సరైన హిట్ సాంగ్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నూరు మేకర్స్.
Also Read
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..