బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నాలో జరిగిన రాజకీయ హత్య తీవ్ర సంచలనంగా మారింది. ఇంటి ముందే వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బస్టాప్ లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన సమయంలో ఆ విద్యార్థినికి తూటా తగలడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థిని హర్‌సిమ్రత్ రంధావా గుర్తించారు. ఆమె కెనడాలోని ఒంటారియోలోని మేహాక్ కళాశాలలో చదువుతోంది. హామిల్టన్ పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు..…
అమెరికాలో ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికుడి అప్రమత్తమై తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
2023లో బహిరంగంగా ఖురాన్ కాపీలను పదే పదే తగలబెట్టిన మాజీ ముస్లిం, క్రైస్తవ ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా స్వీడన్‌లో హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇ
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా రణరంగంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు, భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు, తుపాకీ కాల్పులకు పాల్పడ్డారు.
ఉత్తరాఖండ్‌లో పట్టపగలే ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.
పాకిస్థాన్ (Pakistan)లో ఓ గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. సోమవారం లాహోర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ యజమాని అయిన అమీర్ బాలాజ్ టిప్పు (Gangster Ameer Balaj Tipu) అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్. లాహోర్‌లో (Lahore) జరిగిన వివాహ వేడుకకు (Wedding) హాజరయ్యాడు. మ్యారేజ్ జరుగుతుండగా అమీర్‌పై కొందరు వ్యక్తులు కాల్పులకు జరిపారు. ఈ ఘటనలో…