ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇటీవల ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళై ఉండాలి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు.. అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్, సింగనమల, నార్పల, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, కణేకల్లు, కంబదూరు, రాయదుర్గం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంది..
పోస్టులు..
అంగన్వాడీ వర్కర్ – 03
మినీ అంగన్వాడీ వర్కర్ – 01
అంగన్వాడీ హెల్పర్ – 36
విద్యార్హతలు: పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 2023 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం..
అంగన్వాడీ వర్కర్: 11,500/-
మినీ అంగన్వాడీ వర్కర్: 7,000/-
అంగన్వాడీ హెల్పర్: 7,000/-
ఎంపిక విధానం: పదవ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి..
దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 19, 2023
ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారం కోసం https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ లో చూడవచ్చు..