Priyanka Chopra : ప్రియాంక చోప్రా గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమెపై మాజీ ప్రపంచ సుందరి యుక్తా ముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. యుక్తాముఖి 1999లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రియాంక నాకు జూనియర్. ఆమె 2000 సంవత్సరంలో అందాల పోటీల్లో పాల్గొంది. ఆ టైమ్ లో నా దగ్గరకు తరచూ వచ్చేది. కొన్ని సలహాలు అడిగేది. నేను ఆమెను చాలా సార్లు గైడ్ చేశాను. వాళ్ల పేరెంట్స్ తరచూ మా ఇంటికి వచ్చేవారు.
Read Also : Kannappa : ఇదంతా పరమశివుడి దయ.. మంచు విష్ణు ఎమోషనల్..
ప్రియాంకలో అంతగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ఒక పోటీలా భావించేది. నేను తన కెరీర్ కు ఎక్కడ పోటీగా వస్తానో అని భయపడేది. ఆమెలో పొగిడేంత గొప్ప విషయాలు కూడా ఏమీ లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు వరుస షెడ్యూల్స్ తో దూసుకుపోతోంది. ప్రియాంక ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. ఆమె తన ఫ్యామిలీతో కలిసి అక్కడే సెటిల్ అయిపోయింది.
Read Also : Thammudu : తమ్ముడు సెన్సార్ పూర్తి.. A సర్టిఫికెట్ వచ్చిందే..