Thammudu : యంగ్ హీరో నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న మూవీ తమ్ముడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ మీద మంచి బడ్జెట్ తో తీస్తున్నారు. దగ్గరుండి ప్రమోషన్లు కూడా చేసుకుంటున్నారు దిల్ రాజు. రేపు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది.
Read Also : Siddharth : స్టేజి మీదనే ఏడ్చేసిన హీరో సిద్ధార్థ.. ఎందుకంటే..?
ఇదే ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నాయి. హింస కూడా ఉందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ అంటే కొంత హింస తక్కువే ఉంటుంది. కానీ తమ్ముడు మూవీలో హింస ఉందని తెలుస్తోంది. అయినా సరే ఏ సర్టిఫికెట్ రావడం షాక్ కు గురి చేసింది.
ఇక ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్.. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతోనే ఉన్నాడు. పైగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు వెనకున్నాడు కాబట్టి కొంత పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. మూవీ సాంగ్స్, టీజర్ కూడా ఆకట్టుకుంటున్నాయి. రేపు ట్రైలర్ వచ్చాక మూవీ గురించి తెలుస్తుంది.
Read Also : Manchu Manoj : మా అన్న అదరగొట్టాడు.. ప్రభాస్ వచ్చాక వేరే లెవల్..