Kannappa : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా నేడు థియేటర్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. క్లైమాక్స్ అదిరిపోయిందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన విష్ణు సక్సెస్ పై స్పందించారు. ఇదంతా ఆ పరమ శివుడి దయలాగా అనిపిస్తోంది. అస్సలు మాటలు రావడం లేదు. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి దేవుడు పరమ శివుడు. కానీ మా సినిమా వాళ్లకు కనిపించే ప్రేక్షకులే దేవుడు.
Read Also : Samantha – Sreeleela : ఒకే స్టేజిపై పుష్పరాజ్ భామలు..
వాళ్లు నా సినిమాను మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా సక్సెస్ ను మా నాన్న, అమ్మగారిలో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు విష్ణు. మూవీని వైఎస్ విజయమ్మ చూసి మెచ్చుకున్నారు. అలాగే మంచు మనోజ్ సినిమా అద్భుతంగా ఉంది అంటూ రివ్యూ ఇచ్చాడు. అటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మూవీ గురించి అద్భుతంగా ఉందంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ప్రభాస్ వచ్చాక మూవీ వేరే లెవల్లో ఉందంటూ చెబుతున్నారు. వీకెండ్ వచ్చేసరికి మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రుద్ర పాత్రలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కేవలం మాటలతోనే ఆయన గాంభీర్యం ప్రదర్శించారని చెబుతున్నారు.
Read Also : Thammudu : తమ్ముడు సెన్సార్ పూర్తి.. A సర్టిఫికెట్ వచ్చిందే..