Suhas : యంగ్ హీరో సుహాస్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఈ మధ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో.. రీసెంట్ గానే కీర్తి సురేష్ తో కలిసి ఉప్పుకప్పురంబు సినిమా చేశాడు. అది యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో కీలక పాత్రలో మెరుస్తున్నాడు. అలాగే తెలుగు రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. వాటి కోసం చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఈ టైమ్ లో అతను మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు సుహాస్.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
సుహాస్, లలిత దంపతులకు ఈరోజు కొడుకు పుట్టాడు. వీరికి మొదట కూడా కొడుకే జన్మించాడు. దీంతో సుహాస్ దంపతులకు అభిమానులు, సినీ ప్రేక్షకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. సుహాస్ చిన్న పాత్రలతో నిరూపించుకుని.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కలర్ ఫొటో సినిమాతో మనోడికి మంచి గుర్తింపు వచ్చింది.
Read Also : OG : త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్.. పవన్ ఫ్యాన్స్ థాంక్స్