Little Hearts : మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో చేరింది. యూత్ కు బాగా నచ్చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మౌళి, శివానీ కాంబినేషన్ ను థియేటర్లోనే చాలా మంది చూసేశారు. అయినా సరే ఓటీటీలో వస్తే చూసేందుకు ఎంతో మంది వెయిటింగ్.
Read Also : OG : త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్.. పవన్ ఫ్యాన్స్ థాంక్స్
తాజాగా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈటీవీ విన్ లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. ఇందులో మౌళి, జై కృష్ణ కామెడీ యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఎంసెట్ లో ర్యాంకు రాని కుర్రాడు లాంగ్ డిస్టెన్స్ కోర్సులో చేరుతాడు. అక్కడ బీటెక్ ఫోర్ ఇయర్స్ గా ఫెయిల్ అయిన శివానీ పరిచయం అవుతుంది. వీరిద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీని హైలెట్ చేస్తూ తీసిన సీన్లు అందరినీ కట్టి పడేస్తున్నాయి.
Read Also : OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?