Vijayendra Prasad Intresting Comments on Rajamouli- Mahesh Babu Movie: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా ఎందుకో కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మహేష్ అభిమానుల సహా యూత్ మాత్రం ఎందుకో రొటీన్ సినిమాలాగే ఉందని అప్ టు మార్క్ అనిపించలేదని కామెంట్లు చేశారు. ఆ సంగతి ఉంచితే ఇప్పుడు మహేష్ బాబు తన తర్వాత సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇంకా అసలు ఏమాత్రం మొదలు లేని ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మాత్రం విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా ఇండియానా జోన్స్ లాగానే ఉంటుందని వెల్లడించారు. అలాగే సినిమాకి టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, కానీ కథ మొత్తం అడవి నేపథ్యంలో సాగుతుందని అన్నారు. అడవి అంటే మళ్ళీ పీరియాడికల్ అనుకుంటారు కానీ పీరియాడికల్ కాదు అంతా ఈ రోజుల్లోనే జరుగుతుందని వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, రాజమౌళి లాక్ చేసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు. అంతేగాక ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఇస్తాను మాటల్లో చెప్పలేని అన్నారు. ఎవరూ కూడా ఈ సినిమాని ఇలా ఉంటుందని ఊహించలేని విధంగా ఉంటుందని వెల్లడించారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా మాత్రం నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాతో మహేష్ ఇమేజ్ పెరిగే విషయం గురించి మాట్లాడుతూ వారికి మంచి ఇమేజ్ రావాలని మేము ఖచ్చితంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు.