రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. కానీ మధ్యలో కరోనా అంటూ పలు సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు చిత్రబృందం. అంతేకాదు ప్రేక్షకులను వరుసగా అప్డేట్స్ తో ముంచెత్తడానికి టీం రెడీ అవుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ “లేడీస్ అండ్ జెంటిల్మెన్… ఇట్స్ టైం టు ‘లైగర్’ అప్డేట్స్.. గెట్ రెడీ ఫర్ ‘లైగర్ మ్యాడ్ నెస్” అంటూ ఓ ప్రోమోతో ‘లైగర్’ గ్లింప్స్ విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేశాడు.
Ladies and Gentlemen…
— Vijay Deverakonda (@TheDeverakonda) December 29, 2021
It's Time! pic.twitter.com/tod3Sx8W51
హై ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ డిసెంబరు 31న అంటే 2021 ఏడాది చివరి రోజున ఉదయం 10:03 గంటలకు విడుదల కానుంది. మరుసటి రోజు BTS స్టిల్స్, ప్రత్యేక ఇన్స్టా ఫిల్టర్ ను సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. రాబోయే మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో అప్డేట్స్ తో ‘లైగర్’ సందడి చేయనుంది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి, పూరి కనెక్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.