Vijay Antony: చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విషాదంలో మునిగిపోయిన విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 16 ఏళ్ల మీరా.. డిప్రెషన్, స్ట్రెస్ భరించలేక తన ప్రాణాలను బలవంతంగా వదిలేసింది. మీరా మరణం కేవలం ఇండస్ట్రీనే కాదు.. అటు కోలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను కూడా విషాదంలోకి నెట్టేసింది. ఇంత చిన్నవయసులో మీరా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు. ఇక మీరా మరణ వార్త విన్న కోలీవుడ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఆమె భౌతికదేహానికి నివాళులు అర్పించడానికి ప్రముఖులు కదిలివస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళముందు ప్రాణం లేకుండా కనిపించేసరికి విజయ్, ఫాతిమా గుండెలు అవిసేలా రోదించడం చూపరులను సైతం కంటనీరు పెట్టుకొనేలా చేస్తుంది. ఇక విజయ్ కుమార్తె ఆత్మహత్య కారణంగా.. ఈరోజు రిలీజ్ చేయాల్సిన కొన్ని అప్డేట్స్ ను వాయిదా వేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.
Allu Arjun: మరో అరుదైన గౌరవం అందుకోనున్న అల్లు అర్జున్..
నేడు లియో హిందీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకోపక్క వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న నిత్యా మీనన్ కుమారి.. శ్రీమతి వెబ్ సిరీస్ టీజర్ ను సైతం వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇలాంటి కష్టసమయంలో విజయ్ కు తోడుగా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా నిలబడడం మంచి విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వైజయంతీ మూవీస్.. ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వైజయంతీ మూవీస్ మరో రికార్డ్ ను సృష్టిస్తుందేమో చూడాలి.