పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘స్పిరిట్’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దాని పై చాలా రోజులుగా చర్చ జరుగుతునే ఉంది. సౌత్ కొరియా నటుడు ‘డాంగ్ లీ’ విలన్‌గా నటించబోతున్నట్టుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. డాంగ్ లీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ‘సలార్’ పోస్టర్‌ని షేర్ చేయడంతో ‘స్పిరిట్’ విలన్ ఆయనే అని ఫిక్స్ అయ్యారు.
Also Read : Saif Ali Khan : సైఫ్ అలిఖాన్ కేసు.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగానే లేటెస్ట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ అంటూ ఓ వార్త టాలీవుడ్ సిర్కిల్స్ లో హల్ చల్ చేసింది. ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ ను సంప్రదించగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. వరుణ్ తేజ్ అనే డిస్కషన్ కూడా జరగలేదని అవన్నీఫేక్ అని కొట్టేసారు. ఇక ఈ సినిమాను సమ్మర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్న సందీప్ ఫస్ట్ షెడ్యూల్‌ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే సందీప్ జకార్తాలో లొకేషన్ రెక్కీ కూడా చేశాడట. మరోసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జకార్తా వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేయనున్నాడట. ఆ తర్వాత ఇండియాలోనే మొత్తం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలోనే సందీప్ నుంచి స్పిరిట్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈలోపు ప్రభాస్ ‘రాజాసాబ్’ను పూర్తి చేసి, ‘ఫౌజీ’ సినిమాతో పాటు స్పిరిట్ ను ప్యార్లల్ గా చేయనున్నాడు. ఏదేమైనా స్పిరిట్ మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందనే అంచనాలున్నాయి.