బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో సైఫ్ అలీఖాన్ గాయపడడంతో ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స పొందాడు. గాయాల నుండి కోలుకోవడంతో సైఫ్ అలీఖాన్ తాజాగా డిశార్చి అయ్యారు. ఈ దాడి కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసు కస్టడీలో విచారణ చేస్తున్నారు.
Also Read : Nandamuri Balakrishna : బాలయ్య సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
తాజాగా ఈ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. తన కుమారుడిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని, అతడి తండ్రి మొహమ్మద్ రూహుల్ అమీన్ ఫకీర్ తెలిపాడు. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని వదిలేసి అవే పోలికలతో ఉన్న తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని అన్నాడు. తన కుమారుడు బాల్యం నుంచి జుట్టును చిన్నగా కత్తిరించుకుంటాడని కానీ పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి వేరేలా ఉన్నాడని, 30ఏళ్ల పాటు ఒకేలా ఉన్నవ్యక్తి రాత్రికి రాత్రి ఎలా మారుతారు. నా కుమారుడు ప్రతినెలా 10న జీతం తీసుకున్నాక తమకు ఫోన్ చేస్తాడు, అలాగే సైఫ్‌పై దాడి జరిగిన మరుసటి రోజు కూడా మాతో మాట్లాడాడు. సైఫ్ అలీఖాన్ వ్యకిగత సిబ్బందిని దాటుకొని అతడిపై దాడి చేయడం ఎలా సాధ్యం. నా కుమారుడిని రక్షించుకునేందుకు భారత్‌లో నాకు సాయం చేసేందుకు ఎవరు లేరు. నా కుమారుడిని అరెస్ట్ చేసే విషయంపై ముంబై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నాడు.