పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘స్పిరిట్’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే…