Varun Tej Lavanya Pre Wedding Celebrations: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మోయాలయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకోగా త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని టర్కీ, ఇటలీ దేశాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా అది ఎప్పుడు ఎక్కడ అనే విషయమ్ మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగాస్టార్ తన ట్విటర్ ద్వారా ఫోటోలు షేర్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ దంపతులు సహా మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని కాబోయే వధూవరులైన వరుణ్-లావణ్యలతో ఫోటోలు దిగారు. ఇక నిజానికి వినాయక చవితి నాడు నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పూజలు చేశారు.
Yatra 2: ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది…
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అప్పుడే కాబోయే కోడలు అత్తారింట్లో సందడి చేస్తోంది అంటూ ప్రచారం జరిగింది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు నాగబాబు కుటుంబం, చెల్లెళ్ళ ఫ్యామిలీస్ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు అటెండ్ అయ్యారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక తదితరులు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 9న జరగగా ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు సహా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు.
About Last evening ..
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023