ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు “వైఎస్ రాజశేఖర్ రెడ్డి” జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ‘వైఎస్ఆర్సీపీ’ కార్యకర్తలని మాత్రమే కాకుండా సినీ అభిమానులందరినీ మెప్పించింది. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీ గత ఎన్నికల్లో జగన్ కి, వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ ని ముఖ్యమంత్రి జగన్ బాగా వాడారు. ఇప్పుడు 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ సినిమాని రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ మహి రాఘవ్. తమిళ హీరో జీవా మెయిన్ రోల్ ప్లే చేస్తున్న యాత్ర 2 మూవీని ఫిబ్రవరి 2024 యాత్ర 2 రిలీజ్ చేయనున్నారు. జగన్ రాయకీయ ప్రయాణం మొదలైన దగ్గర నుంచి… ముఖ్యమంత్రి అవ్వకముందు, ఆయన చేసిన పాదయాత్ర, ఇచ్చిన నవరత్నాల హామీలు ఎలా మొదలయ్యాయి అనే విషయాలని యాత్ర 2 సినిమాలో చూపించనున్నారు.
From father to son, from promise to legacy!
Unveiling first look of #Yatra2 on 9th Oct at 11 am.
Witness an extraordinary journey like never before!#Yatra2FL #LegacyLivesOn@ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/tDKXAqd8Xa
— Mahi Vraghav (@MahiVraghav) October 7, 2023
గతంలో వదిలిన యాత్ర 2 మోషన్ పోస్టర్ లో “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి… నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అనే డైలాగ్ ని పెట్టిన మేకర్స్, యాత్ర 2 సినిమాలో ఓదార్పు యాత్ర కీలక ఎపిసోడ్ అవుతుంది హింట్ ఇచ్చారు. లేటెస్ట్ గా యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అక్టోబర్ 9న ఉదయం 11 గంటలకి యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది అనే అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ ని మమ్ముట్టి, జీవ ఇద్దరి ఫేస్ లు రివీల్ చేయకుండా డిజైన్ చేసారు. యాత్ర 2 సినిమాని యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన లీఫ్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ సంతోష్ నారాయణ్ యాత్ర 2 సినిమాకి మ్యూజిక్ ఇస్తుండగా, మధి సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.