చియాన్ విక్రమ్ తాజా చిత్రం “మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం షాక్ అయ్యారు. సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ మూవీలో ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
Read Also : RRR : మేకర్స్ ను కలవర పెడుతున్న మరో సమస్య
ప్రముఖ తమిళ చలనచిత్ర, టెలివిజన్ నటిని ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు మేకర్స్. ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు వాణి పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయగా, సెట్స్ నుంచి ఆమె విక్రమ్‌తో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను సినిమా నుండి మేకర్స్ తొలగించాలని నిర్ణయించుకున్నారట.
సినిమా రన్‌టైమ్ సమస్య కావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ హీరోయిన్ ‘మహాన్-2’వ భాగంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మూవీ దాదాపు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్ తో సాగింది. వాణి పాత్రను కూడా చేర్చితే నిడివి దాదాపు మూడు గంటలు ఉండేది. బహుశా ఆమె పాత్రను కత్తిరించాలని టీమ్ నిర్ణయించుకోవడానికి అదే కారణం కావచ్చు. ఏది ఏమైనా పెద్ద సినిమాలో నటించినా ఒక్క సీన్ లో కూడా కనిపించకపోవడం వాణికి బాధాకరమైన విషయమే. ఆమె సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి ‘మహాన్’ నిరాశనే మిగిల్చాడు.