Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాలో నటిస్తోంది. దీన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also : Show Time : నవీన్ చంద్ర ‘షో టైమ్’ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
ఈ సినిమా తర్వాత కూడా భారీగానే ఛాన్సులు వస్తున్నాయంట. అటు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతోంది. దాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇలా పెద్ద బ్యానర్లలో ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ కు ప్రత్యేకించి హీరోయిన్లు ఎవరూ ఫామ్ లో లేరు. దాంతో లోకల్ హీరోయిన్ అయిన వైష్ణవికి ఛాన్సులు పెరుగుతున్నాయి. అందుకే ఆమె కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందంట. ఒక్కో సినిమాకు కోటి రూపాయల దాకా తీసుకుంటోందని టాక్. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారంట. వరుసగా ఇంకో రెండు హిట్లు పడితే మాత్రం ఆమె కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోవడం ఖాయం.