తొలి సినిమా ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే రెండో సినిమా ‘కొండ పొలం’ టక్కున క్రింద పడేసింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’తో రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. విడుదలైన టీజర్ తో పాటు పాటలు సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు…
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. తమిళ దర్శకుడు గిరీశాయ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మూవీ విడుదల తేదీని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియచేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా నిర్మాత విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచేశారు. నిజానికి ‘రంగరంగ వైభవంగా’ మూవీ మే 27న విడుదల కావాల్సింది.…