Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన సామ్ నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఈ సిరీస్ రీమేక్ గా తెరకెక్కుతుంది. పీసీ సిరీస్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వగా ఫైనల్ ఎపిసోడ్ మే 26 న రిలీజ్ కానుంది. ఇక ఈ సిరీస్ లో ప్రియాంక బోల్డ్ సీన్స్ హైలైట్ గా నిలిచిన విషయం తెల్సిందే. లిప్ లాక్స్, అర్ద నగ్న పోజులు.. ఇలా ప్రియాంక తన అందచందాలను చూపించడానికి శాయశక్తులా ప్రయత్నం చేసింది. ఇక సిరీస్ ఒరిజినల్ కాబట్టి.. రీమేక్ లో కూడా అలాంటి సీన్స్ ఉంటాయి అని, సామ్ బోల్డ్ సీన్స్ చేస్తుంది అని గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగ వరుణ్ తో సామ్ ఘాటు పెదవిని పంచుకోనున్నదని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై సామ్ అభిమానులు ఫైర్ అవుతునాన్రు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ లో ఇలాంటి సీన్స్ చేసి ట్రోల్స్ కు గురయ్యావు.. ఇక ఇందులో కూడా అంటే మరింత ట్రోలింగ్ ఉంటుంది.. అలాంటివి చేయొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.
Romance: శృంగారంలో ఆడవాళ్లు చెప్పే పచ్చి అబద్దాలు ఇవేనట
ఇక ఈ వార్తలు మెల్లగా .. సమంత టీమ్ చెవిన పడడంతో వారు.. ఈ వార్తలపై స్పందించారు. సామ్ ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాంటి సీన్స్ లో సామ్ నటించడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో సామ్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇదే పని ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు ముందు చేసి ఉంటే .. చై తో విడిపోవాల్సిన అవసరం వచ్చేది కాదుగా అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సిరీస్ చేయడం వలనే సామ్- చై మధ్య విబేధాలు తలెత్తాయని, ఆ విబేధాలు విడాకులు వరకు వెళ్లాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా సామ్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని, ట్రోలర్స్ కు ఎంత దూరంగా ఉంటే ఆమె అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.