Devera: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర సినిమాతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆడిపాడనుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫాలోవింగ్ గురించి అస్సలు చెప్పనవసరం లేదు. దేవర సినిమా ఓకే చేయకముందు ఉన్న ఫ్యాన్స్ కంటే.. ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకున్నాకా పెరిగిన ఫ్యాన్సే ఎక్కువ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ఇక జాన్వీ విషయంలో ఏది జరిగినా వీరు దానిని ట్రెండ్ గా మార్చేస్తున్నారు. తాజాగా.. జాన్వీ ఎయిర్ పోర్టు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా హీరోహీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్స్ వైరల్ గానే మారతాయి కానీ, జాన్వీ ఈ లుక్ ఇంకొంచెం వైరల్ గా మారింది. అందుకు కారణం ఆమె చేతిలో ఉన్న దిండు.
Allu Arjun:పెద్దరికం నన్ను ఆపేస్తుంది.. అందుకే ఆ పని చేయడం లేదు
మనం ఎప్పుడైనా రైలులో ప్రయాణం చేయాలంటే.. దిండు తీసుకెళ్తూ ఉంటాం.. ఎందుకంటే .. ఎక్కువ దూరం ప్రయాణిస్తాం కాబట్టి మీద పట్టేయకుండా ఉండడానికి దిండును తీసుకెళతాం.. కానీ, జాన్వీ ఎందుకు దిండు పట్టుకొని ప్లైట్ ఎక్కుతుంది.. అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఇక ఆ దిండు చూస్తుంటే.. హోటల్స్ లో ఉన్న బెడ్స్ మీద ఉండే దిండులా కనిపిస్తుంది.. జాన్వీ.. హోటల్ నుంచి దిండు దొంగతనం చేసిందా..? అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా.. ఏం.. జాన్వీ పాప.. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా..? అని ట్రోల్ చేస్తున్నారు. అది రైలు కాదు పాప.. ఫ్లైట్.. అందులోకి దిండు ఎందుకు అని కొందరు.. కాదు కాదు.. వరుస షూటింగ్స్ ..పాపం జాన్వికి పడుకోవడానికి కూడా టైం లేదేమో.. అందుకే ఎక్కడ సమయం ఉన్నా దిండు వేసుకొని పడుకుండిపోతుంది అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.