True Lover: తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని తెలుగువారికి మణికందన్ ను పరిచయం చేసింది. ఇక ఈ గుర్తింపుతో మణికందన్ తెలుగులో సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం లవర్. తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా.. తెలుగులో డైరెక్టర్ మారుతీ, నిర్మాత SKN తో కలిసి ఫిబ్రవరి 10 న రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం విశేషం.
ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు.. విడిపోవడం, మళ్లీ కలవడం, పెళ్లి, వారి మధ్య ఉండే భయాలు.. ఇలా అన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యాయి. పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలెక్షన్లను వసూల్ చేస్తూ దూసుకెళ్తోంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో మణికందన్ తెలుగులో మరిన్ని అవకాశాలను అందుకుంటాడో లేదో చూడాలి.